Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకు హాజరు కావల్సివుంది. ఆ తరుణంలో విచారణకు హాజరు కాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. ఈ- మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు తెలిపారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్ ద్వారా కవిత పంపారు.