Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రశ్నపత్రం లీకైన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
మునిసిపల్ పరిపాలన విభాగంలో ఖాళీగా ఉన్న 837 అసిస్టెంట్ ఇంజనీర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను జారీ చేసి ఈ నెల 5న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోస్టుల కోసం మొత్తం 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 162 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా పేపర్-1కు 55,189 మంది, పేపర్-2కు 54,917 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పేపర్ లీకైన కారణంగా ఈ పరీక్ష రద్దుచేసినట్లు తెలుస్తుంది.