Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్.. ముంబైకి చెందిన ఓ లేడీ డిజైనర్‌పై కేసు బుక్ చేశారు. అనిక్షా అనే మహిళతో పాటు ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు నమోదు చేశారు. డిజైనర్ అనిక్షా తనను బెదిరిస్తున్నట్లు, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అమృత తన ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఫిబ్రవరి 20వ తేదీ ఆ ఎఫ్ఐఆర్ను ఆమె పోలీసులకు ఇచ్చారు. డిజైనర్ తండ్రి ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారని, ఆయన్ను కాపాడేందుకు చొరవ చూపాలని, దాని కోసం కోటి రూపాయాలు ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించినట్లు అమృతా ఫడ్నవీస్ ఆరోపించారు. 2021 నవంబర్‌లో అమృతను తొలిసారి ఆ మహిళ కలిశారు. ఫిబ్రవరి 18,19 తేదీల్లో డిజైనర్ అనిక్షా తనకు వీడియో క్లిప్‌లను, వాయిస్ నోట్స్, మెసేజ్‌లను పంపినట్లు అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.