Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్బాట్లు టెక్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. చాట్‌జీపీటీపై హాట్ డిబేట్ సాగుతుండగా హాంకాంగ్‌కు చెందిన గేమింగ్ కంపెనీ తమ సీఈఓగా ఏకంగా ఏఐ బాట్‌ను నియమించింది.
అయితే ఈ తరుణంలో నిర్వహణా సామర్ధ్యాన్ని సరికొత్త స్ధాయికి తీసుకువెళ్లడంతో పాటు కార్పొరేట్ మేనేజ్మెంట్లో ప్రక్షాళన దిశగా ఏఐ వినియోగాన్ని పెంచేందుకు ఏఐ చాట్‌బాట్‌ను అత్యున్నత స్ధానంలో నియమించినట్టు నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ తెలిపింది. నాయకత్వ స్ధాయిలో నిర్ణయాలు తీసుకోవడం, హైలెవెల్ అనలిటిక్స్ సమీక్షించడం, రిస్క్‌లను అంచనా వేయడం వంటి కీలక బాధ్యతలను ఏఐ సీఈఓ టాంగ్ యూకు గేమింగ్ కంపెనీ అప్పగించింది. ఏఐ చాట్‌బాట్‌ను సీఈఓగా నియమించడం ద్వారా నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగులందరికీ మెరుగైన పని ప్రదేశాన్ని సృష్టించడంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కంపెనీ ఆశిస్తోంది. టాంగ్ యూ నియామకంతో కంపెనీ ఏఐ ప్లస్ మేనేజ్మెంట్ వ్యూహాలకు పదునుపెట్టడంతో పాటు మెటావర్స్ సంస్ధగా కంపెనీని మలిచేందుకు దోహదపడుతుంది.