Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాకినాడ
నగరంలోని గోల్డ్ మార్కెట్ సెంటర్ సమీపంలో ఓ కారు ద్విచక్రవాహనదారులు, సైకిళ్లపై దూసుకెళ్లి హల్చల్ చేసింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కారులోని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కాకినాడ మూడో పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పలు బైక్‌లు, కార్లు ధ్వంసమైనట్టు సమాచారం. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు ప్రకారం తెలుస్తుంది.