Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : ప్రీమియం గెలాక్సీ ఎస్23 సిరీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ గెలాక్సీ ఏ 14 లాంఛ్ చేసిన తర్వాత భారత్‌లో మరో రెండు న్యూ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ లాంఛ్ చేసింది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ34, గెలాక్సీ ఏ54లను కంపెనీ లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్లను 5000ఏంహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉన్నాయి. రెండు స్మార్ట్ఫోన్లు నాలుగు జనరేషన్ల ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో పాటు ఐదేండ్ల సెక్యూరిటీ అప్డేట్స్తో కస్టమర్ల ముందుకొచ్చాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ34 8జీబీ ర్యాం 128జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 30,999 కాగా, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 32,999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైమ్, గ్రాఫైట్, సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. ఇక గెలాక్సీ ఏ54 ఇరు స్టోరేజ్ వేరియంట్లు వరుసగా రూ. 38,999, రూ. 40,999కి లభిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లైమ్, గ్రాఫైట్, వయలెట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు శాంసంగ్ ఎక్ల్సూజివ్, పార్ట్నర్ స్టోర్స్‌లో మార్చి 28 నుంచి లభిస్తాయి. శాంసంగ్ ఏ34 ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొచ్చింది.
డిస్ప్లే విజన్బూస్టర్ టెక్నాలజీ ప్రత్యేకతతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇక గెలాక్సీ ఏ34 తరహాలో కనిపించే గెలాక్సీ ఏ54 వెనుక భాగంలో గ్లాస్ ఫినిష్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొచ్చింది. ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 5 ఎంపీ మ్యాక్రో కెమెరాతో పాటు ముందు భాగంలో అడ్వాన్స్డ్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగిఉంది.