Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గురువారం ఉదయం భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. 9 -10 గంటల మధ్య అక్కడక్కడ సూర్యుడు కనిపించినప్పటికీ, కాసేపటికే మళ్లీ మబ్బులు కమ్మేశాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.
హైదరాబాద్ నగరానికి సమీపంలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. వానల తరుణంలో ఆయా శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.