Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను హాజరుకాలేనని అధికారులకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపిన విషయం తెలిసిందే. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.