Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగచైతన్య విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక ద్విభాషా చిత్రం చేశాడు .. ఆ సినిమా పేరే 'కస్టడీ'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, పోస్టర్స్ రిలీజ్ దగ్గర నుంచే అందరిలో ఆసక్తిని పెంచడం మొదలైంది. మే 12 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. 'ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు. నిజం ఒక ధైర్యం .. నిజం ఒక సైన్యం .. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది' అనే హీరో డైలాగ్ సినిమాపై ఆత్రుతను పెంచుతోంది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.