Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బిహార్
ఏకంగా తన పెండ్లి విషయాన్నే మర్చిపోయాడు ఓ వరుడు! ముహూర్త సమయానికి వివాహ మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లాడు. అదీ మద్యం తాగి వచ్చాడు. దీంతో వరుడి కోసం మండపంలో ఎదురు చూసిన వధువు ఏకంగా పెండ్లినే రద్దు చేసుకుంది. బిహార్ భాగల్పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెండ్లి నిశ్చయించారు. మంగళవారం ఉదయం ముహూర్తాన్ని ఖరారు చేశారు. వివాహ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాకకోసం ఎదురు చూసింది. ముహూర్త సమయం దాటినా పెండ్లి కుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెండ్లి మండపానికి వచ్చాడు. ఇది గమనించిన ఆ వధువు నాకీ పెండ్లి వద్దంటూ తిరస్కరించింది.