Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. గ్లోబర్ స్టార్‌గా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు గెస్టుగా ఆహ్వానం కూడా అందుకున్నారు. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొని సందడి చేశారు.
రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న రామ్ చరణ్ ఇవాళ స్వదేశానికి రానున్నారు. అయితే నేరుగా ఇంటికి వెళ్లకుండా చరణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఇవాళ జరగనున్న ఇండియా టుడే కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు సమాచారం. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.