Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబుయి
అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 404 పాయింట్ల లాభంతో 58,039 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 17,097 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని 82.54 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.