Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 700కుపైగా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో ఇవే అత్యధికం. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాలకు లేఖ రాసింది. టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్, వైద్య చికిత్స ప్రక్రియలను ముమ్మరం చేయాలని కోరింది. కొవిడ్ కేసుల పెరుగుదలను సీరియస్‌గా తీసుకోవాలని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది.
నిర్దేశిత ప్రాంతంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటే ముందస్తు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొంది. జిల్లాలు, సబ్ జిల్లాల స్థాయిలో కొవిడ్ వ్యాప్తి ఎలా ఉందన్నది అంచనావేయాలని సూచించింది. కాగా, దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 4,623కు చేరింది. మొత్తం కేసుల్లో ఇవి 0.01 శాతం. ఇప్పటివరకు దేశంలో 4.4 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. కాగా, కొవిడ్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వేరియంట్ ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ బి1, బి2లను కలిగి ఉందని వెల్లడించింది.