Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రవీంద్రభారతిలో ఈ నెల 22న నిర్వహించనున్న శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశించారు. ఉగాది ఏర్పాట్లపై ఆమె గురువారం ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో సమీక్షించారు. వేదపండితులు, అవార్డు గ్రహీతలు రావడానికి రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదిక వద్ద తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు. ప్రజలకు తగిన భద్రత కల్పించాలని, వాహనాల పార్కింగ్ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అధికారులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, శేషాద్రి, శ్రీనివాసరాజు, దాన కిషోర్, అనిల్‌కుమార్, హరికృష్ణ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి పాల్గొన్నారు.