Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కమెడియన్ ఖ్యాలి సహరన్ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ జైపూర్లోని ఓ హోటల్లో కమెడియన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు ఉద్యోగం కావాలంటూ ఓ నెల క్రితం కమెడియన్ ఖ్యాలి సహరన్ సాయం కోరారు. ఎలాగోలా ఉద్యోగం ఇప్పిస్తానంటూ సదరు కమెడియన్ వారికి హామీ ఇచ్చాడు. ఈ విషయంపై మాట్లాడదామంటూ ఇటీవల ఓ హోటల్లో రెండు గదులను బుక్ చేశాడు ఖ్యాలి. ఇద్దరు యువతులకు ఓ గది ఇచ్చి మిగతా గది తాను తీసుకున్నాడు. వారితో సంభాషిస్తున్న సమయంలో తను మద్యం తాగడమే కాక వారిని కూడా తాగమని బలవంతం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఓ యువతి అక్కడి నుంచి వెళ్లిపోగా మరో యువతిపై ఖ్యాలి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాగా ఖ్యాలి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది.