Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో అవినాష్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం. అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని అవినాష్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచుతూ.. తమ్ముడు, ఆత్మీయుడైన ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు.