Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు. రాజకీయాల్లో కాషాయ పార్టీ రాటుతేలిందని ఆయన చురకలు వేశారు.
ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో శశి థరూర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విదేశీ గడ్డపై రాజకీయాలు మాట్లాడిన విషయంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే ప్రధాని మోదీనే ముందుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని, ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొటోందని రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశంలో వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్నారని రాహుల్ ఇటీవల బ్రిటన్ వేదికగా వ్యాఖ్యానించారు.