Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేలా అధికారులను ఆదేశించారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ సీజ్ చేస్తాం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి గాంధీ ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేలా అధికారులను ఆదేశించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో భవిష్యత్తు ఉన్న పిల్లలు మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. 22, 23 ఏళ్ల వయసు ఉన్న పిల్లలే మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. అగ్ని ప్రమాద నివారణకు సరైన జాగ్రత్తలు పాటించని భవన, గోదాముల నిర్వాహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను సీజ్ చేస్తామని ప్రకటించారు.