Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కలిశాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్‌ను యువరాజ్ పరామర్శించాడు. అతడితో కాసేపు ముచ్చటించాడు. ఈ విషయాన్ని యువరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. పంత్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేసుకున్నాడు. “ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఈ ఛాంపియన్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు” అంటూ రిషభ్ పంత్‌తో దిగిన లేటెస్ట్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ క్రమంలో రిషబ్ ఆత్మవిశ్వాసాన్ని చూసి మురిసిపోయిన యువీ.. రిషభ్ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడని, నెగిటివ్ ఆలోచనలు దరిచేరనీయడంటూ కొనియాడాడు. త్వరగా కోలుకుని తిరిగి మునపటిలా మారాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది. టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత స్టిక్ సహాయంతో ఇప్పుడిప్పుడే నడవడం కూడా మొదలుపెట్టాడు. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు.