Virat naatu naatu step vesthunadu ga @tarak9999 @AlwaysRamCharan @imVkohli#NaatuNaatu pic.twitter.com/3sLOIYiUMT
— AK🐾 (@Arun_2_) March 17, 2023
Authorization
Virat naatu naatu step vesthunadu ga @tarak9999 @AlwaysRamCharan @imVkohli#NaatuNaatu pic.twitter.com/3sLOIYiUMT
— AK🐾 (@Arun_2_) March 17, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : 'నాటు నాటు' ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఆస్కార్ వేదికతో మొదలు క్రికెట్ మైదానం దాకా ఎక్కడ చూసినా అదే ఆట.. పాట.. అందరూ కాళ్లు కదిపే వాళ్లే. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరాడు. మైదానంలో 'నాటు నాటు' స్టెప్పులేస్తూ కనిపించాడు. ఇంకేముంది వీడియో వైరలైంది. ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ఈ రోజు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో స్లిప్స్ లో నిలబడిన కోహ్లీ.. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే సింక్ లో వేసిన స్టెప్స్ ను తానొక్కడే వేస్తూ కనిపించాడు. మరీ చరణ్, ఎన్టీఆర్ లా కాకున్నా బాగానే వేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.