Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని పద్మారావు నగర్ పార్క్లో వాకింగ్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఘటన బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రదీప్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని , ఆపద్భందు పథకం కింద మరో రూ. 50 వేలు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.