Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకొని భారీ లాభాలతో ఈ వారానికి స్వస్తి పలికాయి. ఐటీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ జంట షేర్ల వంటి దిగ్గజ స్టాక్స్ భారీగా నష్టపోవడం మధ్యాహ్నం సూచీలను కిందకు లాగింది. తర్వాత ఐటీ స్టాక్స్‌లో వచ్చిన కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు అండగా నిలిచింది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అమెరికాలో బడా బ్యాంకులు చేస్తున్న యోచనలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మరోవైపు గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కీలక కౌంటర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కలిసొచ్చింది.