Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు దుర్మరణం చెందగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.గాయపడ్డవారిని ధర్మవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.