Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజన్న జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో దారుణం జరిగింది. చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన చిటికె నవీన్‌కుమార్ (30) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీడీ కంపెనీ నడిపే నాగభూషణానికి నలుగురు కుమారులు కాగా.. చిన్న కుమారుడు నవీన్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతూనే, సాఫ్ట్వేర్ రంగంలోనైనా ఉద్యోగం సాధించాలని యత్నించాడు. కానీ, ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో తనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని తీవ్ర నిరాశ చెందాడు. ఉద్యోగం లేని జీవితం వృథా అంటూ సూసైడ్ నోట్ రాసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నవీన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.