Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై: తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి హత్యచేశాడు. పోలీసుల కథనం మేరకు... తమిళనాడులోని విళుపురం జిల్లా రాధాపురం గ్రామానికి చెందిన సుధన్ కుమార్తె ధరణి(20) అదే ప్రాంతంలోని నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. మదురపాక్కం గ్రామానికి చెందిన యువకుడు గణేశన్ మూడేళ్ల నుంచి ఆ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో గణేశన్పై ఓ హత్య కేసు నమోదవడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలిసిన ధరణి.. అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం యువతి తన ఇంటి ఆవరణలో ఉండగా అక్కడికి వచ్చిన గణేశన్ కత్తితో ఆమె గొంతు కోసి పారిపోయాడు. దీంతో ధరణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.