Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర్‌ప్రదేశ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆత్మహత్య చేసుకున్న తన సోదరి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించడానికి అంబులెన్సు లేకపోవడంతో.. ద్విచక్రవాహనంపై పెట్టుకుని దాదాపు 10 కి.మీ. ప్రయాణించాడు ఓ యువకుడు. నిరాషా దేవి అనే బాలిక ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదన్న బాధతో గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. దీంతో కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటుచేయాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు. అరగంటకు పైగా వేచి చూసినా వారు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేదు. దీంతో మృతురాలి సోదరుడు కుల్దీప్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తన సోదరి మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.