Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆస్కార్ అవార్డ్స్ కోసం లాస్ఏంజెలెస్ వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి గత రాత్రి ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశారు. తొలుత చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరూ మంత్రికి శాలువాలు కప్పి సత్కరించగా, అనంతరం రామ్ చరణ్‌కు అమిత్ షా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కాసేపు ముగ్గురు ముచ్చటించుకున్నారు. అనంతరం ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలను కలవడం ఆనందంగా ఉందని షా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్ అద్భుత విజయం, నాటునాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు రామ్‌చరణ్‌ను అభినందించినట్టు పేర్కొన్నారు. కాగా, ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ్‌చరణ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.