Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలల వారధి కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 14న ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం వెల్లడించారు. 224 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, వచ్చే నెల 14 వరకు అప్రోచ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని, ఆ తర్వాతి నుంచి సందర్శకులకు అనుమతి ఇస్తామని చెప్పారు.
కార్పొరేషన్, మార్చి 17: కరీంనగర్ మానేరు నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 224 కోట్లతో చేపట్టిన పనుల్లో కేబుల్ బ్రిడ్జిపనులు పూర్తయ్యాయని, అప్రోచ్ రోడ్డు పనులను వచ్చే నెల 14 వరకు పూర్తి అవుతాయన్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేసిన కేబుల్ బ్రిడ్జి నగరానికి ఒక పర్యాట కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ బ్రిడ్జిపై 6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ పనులు పూర్తి అవుతున్నాయన్నారు. పర్యాటకంలో భాగంగానే.. ప్రజల సందర్శన నిమిత్తం ఏప్రిల్ 14 నుంచి సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. కొద్ది రోజుల పాటు ఈ బ్రిడ్జిపైనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మానేరు రిఫర్ ఫ్రంట్లో భాగంగా కొనసాగుతున్న పనులు, అది పూర్తయి తే అక్కడ పర్యాటకులకు ఎన్ని సౌకర్యాలు స మకూరుతాయో చెప్పే వీడియోలను ప్రదర్శిస్తామని తెలిపారు. సందర్శకులు బ్రిడ్జిపై ఆహ్లాదంగా గడిపేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపా రు. కరీంనగర్ ప్రజలు ఈ సౌకర్యా న్ని వియోగించుకోవాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.