Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. భాజపా లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్.. సంజయ్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈరోజు హాజరుకాలేనని తెలిపారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సూచించినట్టుగా ఈనెల 18న హాజరవుతానని లేఖలో అభ్యర్థించగా.. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన కమిషన్ ఎదుట హాజరయ్యారు.