Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని చరణ్ అన్నారు. కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందని తనకు అవకాశం వస్తే సంతోషిస్తానని చెప్పారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సినీ స్టార్లు, క్రికెటర్ల జీవిత చరిత్రలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలన్నీ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరిన్న బయోపిక్ లను తెరకెక్కించేందుకు మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు. కోహ్లీ చరిత్ర కూడా సినిమాకు బాగ్ సెట్ అవుతుంది. కోహ్లీ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని షేడ్స్ ఉన్నాయి. చిన్న తనంలో సాధారణ జీవితం గడపడం, క్రికెటర్ గా ప్రపంచ దిగ్గజంగా ఎదగడం, బాలీవుడ్ నటి అనుష్కతో ప్రేమ, పెళ్లి, క్రికెట్ కెప్టెన్ గా బీసీసీఐనే కంట్రోల్ చేసే స్థాయికి ఎదగడం ఇలా ఎన్నో కోహ్లీ జీవితంలో ఉన్నాయి. కోహ్లీ బయోపిక్ తెరకెక్కితే భారీ హిట్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఎందరో సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చరణ్ వ్యాఖ్యలను విని బాలీవుడ్ నుంచి కానీ, సౌత్ నుంచి కానీ ఎవరైనా దర్శకనిర్మాతలు ముందుకొస్తారేమో వేచి చూడాలి. త్వరలోనే చరణ్ హాలీవుడ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.