Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వం స్వీకరించినవారు మన దేశంలో వదిలిపెట్టిన స్థిరాస్తులను ఖాళీ చేయించి, వాటిని విక్రయించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇటువంటి ఆస్తులను శత్రు ఆస్తులు అంటారు. మన దేశంలో మొత్తం మీద 12,611 శత్రు ఆస్తులు ఉన్నాయని, వాటి విలువ రూ.1 లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేశారు. శత్రు ఆస్తుల చట్టం ప్రకారం ఏర్పాటైన కస్టోడియన్ పరిధిలో ఈ ఆస్తులు ఉంటాయి. ఈ అథారిటీని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా అంటారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో, శత్రు ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన మార్గదర్శకాలు మారినట్లు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ సహాయంతో శత్రు ఆస్తులను ఖాళీ చేయించే ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది.