Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న కవితను విచారించాలని ఈడీ నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈడీ విచారణ, కోర్టు వాయిదాలు.. నిందితుల కస్డడీ ఇలా అనేకానేక పరిణామాలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడీ విచారణకు డుమ్మా కొట్టి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈడీ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని, మహిళా హక్కులను గౌరవించడం లేదని ఈడీపై కవిత విమర్శలు సంధిస్తున్నారు. ఆమె గత విచారణకు డుమ్మా కొట్టడం, కోర్టులో పిటిషన్ వేయడంతో గందరగోళంగా మారింది.