Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి నిందితులను సిట్ టీమ్ ప్రశ్నిస్తుంది. ఇవాళ రెండో రోజున సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నజర్ పెట్టింది. ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఏమైనా లీయయ్యాయా అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.