Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
న్యూఢిల్లీ: ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ. 239 ఆపైన యాక్టివ్ డేటా ప్లాన్ కలిగిన వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ అపరిమిత 5జీ డేటాను ప్రారంభ ఆఫర్‌గా అందిస్తోంది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు ఈ ప్రయోజనం పొందొచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్టెల్ పట్టుదలగా ఉంది. తర్వాతి తరం వైర్లెస్ బ్రాడ్‌బ్రాండ్ సేవల వైపు వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అపరిమిత 5జీ డేటా ఆఫర్‌ను పరిచయం చేసింది. చందాదారులు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ‘క్లెయిమ్ అన్లిమిడెట్ 5జీ డేటా’పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. కనీసం రూ. 239 యాక్టివ్ అన్లిమిటెడ్ ప్లాన్ ఉన్న ప్రీపెయిడ్ వినియోగదారులు దీనికి అర్హులని పేర్కొంది. రీచార్జ్ తర్వాత ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. పోస్టుపెయిడ్ వినియోగదారులైతే ప్రతి నెల బిల్ జనరేట్ అయ్యే సమయంలో దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.