Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెద్దపల్లి: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించే మంత్రి కేటీఆర్ తరుచూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని కొద్దిగంటల్లోనే మంత్రి ఫాలోవర్ ఒకరు తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పారా అథ్లెట్ తాటికొండ నెహ్రూ పుణేలో జరుగనున్న జాతీయపారా అథ్లెటిక్స్‌లో రాష్ట్రం తరుఫున ఆడనున్నారు. తనకు ఆర్థిక సహాయం కావాలని అతడు మంత్రిని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ ట్విటర్‌ను చూసే ఫాలోవర్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య రాంరెడ్డి కుమారుడు ఎన్ఆర్ఐ హరీశ్‌రెడ్డి స్పందించి, క్రీడాకారుడు నెహ్రూ బ్యాంక్ ఖాతాకు రూ. 60 వేలు పంపించి ఉదారతను చాటుకున్నాడు. హరీశ్‌రెడ్డి గతంలో కూడా కేటీఆర్ ట్వీట్లకు స్పందించి, వైద్య విద్యార్థినికి రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందజేసి శభాష్ అనిపించుకున్నాడు.