Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
విశాఖపట్నంలో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు్కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా జోరుకు ఆసీస్ బ్రేక్ లు వేసింది. ఆదివారం విశాఖ సాగరతీరం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు చిత్తు చేసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఛేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చ్ 22న జరగనుంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమే అని రోహిత్ శర్మ అంగీకరించాడు.
ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. స్కోర్ బోర్డుపై తగినంత పరుగులు ఉంచలేకపోయామంటూ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. కేవలం 117 పరుగుల మాత్రమే చేస్తామని అస్సలు ఊహించలేదు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మా జట్టును తీవ్రంగా దెబ్బతీసిందన్నాడు. తొలి ఓవర్ లో శుబ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయినప్పుడు.. నేను విరాట్ ఇన్సింగ్స్ ను కాస్త సెట్ చేశాము.. మేమిద్దరం త్వరగా 30 నుంచి 35 పరుగులు రాబట్టాము.. అయితే తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయాం.. అది మమ్మల్ని మరింత వెనక్కి నెట్టిందని రోహిత్ శర్మ తెలిపారు.