Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్‌పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సోమవారం కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తున్నది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరిగే ఈ మహా పంచాయత్‌కు దేశంనలుమూలల నుంచి లక్షలాది మంది రైతులు తరలివస్తున్నారని ఎస్కేఎం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రైతుల కష్టాలు తీర్చేందుకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. జేపీసీకి పంపిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎస్కేఎం, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు చేసిన తర్వాతనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతామనే హామీని కేంద్రం ఇవ్వాలని పేర్కొన్నది. కాగా, 11 రాష్ర్టాల నుంచి రైతులు శనివారం నుంచే ఢిల్లీకి రావడం ప్రారంభమైందని పొలీసులు తెలిపారు.