Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్ధిపేట
ఇవాళ హుస్నాబాద్ లో లక్ష మందితో మంత్రి కేటీఆర్ సభ ఉంటుందని.. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. గౌరవెల్లి ప్రాజెక్టు లో బాధితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమనిౌ రూ. 20కోట్లతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు మంజూరు చేశామని వెల్లడించారు.
8టీఎంసీల గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమనిౌ గౌరవెల్లి ప్రాజెక్టును ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బిజెపి పార్టీలు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహించారు. గౌరవెల్లి నిర్మాణం కోసం ఇసుక తీస్తుస్తే బీజేపీ నాయకుడు రాంగోపాల్ రెడ్డి హైకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని.. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి నీళ్ళు ఇవ్వడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా .5 టీఎంసీల సామర్థ్యం కలిగిన గండిపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారుౌ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.