Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల చట్టం 1962 సవరణ బిల్లును కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశ పెట్టారు. 2022 జవనరి 1వ తేదీ నుంచి 2022 నవంబరు 29 మధ్య అరవై సంవత్సరాలు నిండి, సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన గ్రంథాలయ సంస్థల ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.