Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వికారాబాద్
వికారాబాద్ జిల్లా, పరిగి మండలం సయ్యద్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ టీచర్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదాడు. సయ్యద్ పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజేందర్ ప్రతి రోజూ స్కూల్ కి తాగొచ్చి విచక్షణా రహితంగా విద్యార్థులను చితకబాదేవాడు. పిల్లల తల్లిదండ్రులు ఎన్ని సార్లు హెచ్చరించినా తన అలవాటు మానుకోలేదు.
దీంతో రాజేందర్ పై ఆగ్రహించిన గ్రామస్థులు డీఈఓ కు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో స్కూల్ విద్యార్థులను చితకబాదుతున్నాడని, విధులు సరిగా నిర్వహించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడని టీచర్ రాజేందర్ పై గ్రామస్థులంతా డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చర్యలు తీసుకున్న జిల్లా విద్యాధికారి విచారణ జరిపించి ఈ నెల 15న రాజేందర్ ను విధులనుంచి చేశారు.