Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది. వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గెలిచింది. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మూడో వన్డే కీలకంగా మారింది. దీంతో సిరీస్ను డిసైడ్ చేసే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టికెట్ల కోసం ఫ్యాన్స్ బారులు తీరారు. టికెట్లను దక్కించుకునేందుకు రాత్రిని సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చున్నారు. అయితే టికెట్లు పంపిణీ చేయడంలో ఆలస్యం కావడంతో కొందరు అక్కడే క్యూ లైన్లలోనే కనుకు తీస్తున్నారు. అర్థరాత్రి 2 గంటల నుంచే స్టేడియం వద్ద క్యూలు కట్టారు. కొందరైతే దుప్పట్లు తెచ్చుకొని పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.