Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ స్పోర్ట్స్ కోచ్ సస్పెండ్‌కు గురయ్యాడు. ఆదిలాబాద్ లోని తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ లో స్పోర్ట్స్ కోచ్ బీ రవీందర్ ఔట్ సోర్సింగ్ కింద విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఆ కోచ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తొమ్మిదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోచ్ రవీందర్ విద్యార్థినులను వేధించినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.