Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో ప్రాణాలు కొల్పోయింది. వర్లి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మి రామకృష్ణన్ (42) ఓ టెక్ కంపెనీకి సీఈవో. ఆమెకు రోజూ ఉదయం జాగింగ్ చేయడం అలవాటు.
తనను తాను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పుకునే రాజలక్ష్మి.. రోజూలాగే ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లింది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన టాటా నెక్సాన్ ఈవీ కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.