Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ తరుణంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై విమర్ళలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి నోటీసులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని సిట్ కోరింది.
ఇటీవలే మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.