Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఓ దశలో భారీ అమ్మకాల సెగతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు మార్కెట్లను వెంటాడాయి. దిగ్గజ షేర్ల పతనం సూచీలను మరింత కిందకు తీసుకెళ్లింది. మరోవైపు ఈ వారం జరగనున్న ఫెడ్ సమావేశం కూడా మదుపర్లను అప్రమత్తం చేసింది.