Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు కాందార్ లోహలోనే మకాం వేసి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ జనసమీకరణ చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న తెలంగాణ మోడల్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టడం ద్వారా కాందార్ లోహ సభకు భారీ జన సమీకరణ చేయాలనే లక్ష్యంతో పలు గ్రామాలకు 20 ప్రచార రథాలు, 10 ఎల్ఈడీ వీడియో స్ర్కీన్ వాహనాలను సోమవారం జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార రథాల ద్వారా తెలంగాణకు సంబంధించి కోటి ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుఏడాదికి ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలు అప్పుపాలు కాకుండా ఆదుకుంటున్న రైతుబంధు పథకం అమలు చేస్తున్నారన్నారు.