Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ 2023) కు దరఖాస్తులు సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి.
అర్హులైన అభ్యర్థులు మార్చి 20న రాత్రి నుంచి ఏప్రిల్ 19వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ పరీక్షకు అభ్యర్థుల అర్హత, పరీక్ష కేంద్రాలు, పరీక్ష ఫీజు, సమయం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర వివరాలను ఈరోజు రాత్రి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు.