Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రు.20వేల నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలి
గత నాలుగు రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ధాన్యం, మామిడి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పొద్దుతిరుగుడు, కూరగాయలు తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పిడుగులు పడటంతో ప్రాణనష్టం, ఆస్థినష్టం జరిగింది. గొర్రెలు, మేకలు, కోళ్లు చనిపోయాయి. తక్షణమేనష్టాల గణాంకాల పూర్తి వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రంలో 2018 నుండి నేటివరకు 1500 కోట్ల పంటల నష్టం వాటిల్లింది. 2020 నుండి 2023 వరకు రు.1787కోట్లు 15వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రకటించినా నేటికీ నష్టపరిహారం అందింది నామమాత్రమే. 2022 వానాకాలంలో అధిక వర్షాల వల్ల 11లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 6గురు మరణించారు. ఈ ఏడాదిలోనే రు.3500కోట్ల నష్టం వాటిల్లింది. దానికి తోడు ప్రస్తుతం వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జరిగిన నష్టంపై వెంటనే కేంద్రానికి లేఖ రాసి పరిశీలనకు ప్రత్యేక టీమ్‌ను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.20వేల చొప్పున పరిహారం చెల్లించాలి. ఇళ్లు దెబ్బతిన్న వారికి, జీవాలు, ఇతరత్రా నష్టం జరిగిన వారికి ఆర్ధిక సహాయం అందించాలి. ప్రాణాలు కోల్పోయినవారికి ఎక్స్‌గ్రేషియో చెల్లించి వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల కోసం రాష్ట్ర బడ్జెట్లో రు.3వేల కోట్లు కేటాయించాలి.