Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
రంజాన్మాసం సందర్భంగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు తీపికబురు తెలిపింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల నుంచి గంట ముందు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ప్రార్ధనలు చేసుకునేందుకు గంటముందు వెళ్లేలా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు.