Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
డబ్ల్యూపీఎల్ లో కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్ సత్తా చాటింది. గుజరాత్ జెయింట్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది.
గ్రేస్ హ్యారిస్ (72; 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులకు తోడు తాహిలా మెక్‌గ్రాత్ (57; 38 బంతుల్లో 11 ఫోర్లు), అర్ధ శతకంతో రాణించడంతో ఈ లక్ష్యాన్ని యూపీ19.5 ఓవర్లలో 7వికెట్లను నష్టపోయి ఛేదించింది. దేవికా వైద్యా (7), అలీసా హీలే (12), కిరణ్ నవ్గిరె (4), దీప్తి శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్న సోఫీ ఎకిల్‌స్టోన్ (19) యూపీని గెలిపించింది.